NEWSNATIONAL

అగ్నివీర్ ను ర‌ద్దు చేయాలి

Share it with your family & friends

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. మోడీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన అగ్ని వీర్ స్కీమ్ యువ‌త పాలిట శాపంగా మారింద‌ని ఆరోపించారు. సంజ‌య్ సింగ్ గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

అగ్ని వీర్ యోజ‌న దేశ సైన్యానికి తీర‌ని ద్రోహం త‌ల‌పెట్టింద‌ని పేర్కొన్నారు. భారత మాతను, భారత సైన్యాన్ని ప్రేమించే వారు ఎవరైనా ఖచ్చితంగా అగ్నివీర్ పథకాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌ధాన మంత్రిగా పోటీ ప‌డుతున్న న‌రేంద్ర మోడీ వ‌య‌స్సు 74 ఏళ్లు అని , కానీ 21 ఏళ్ల‌కే దేశ సైనికులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల‌ని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు సంజ‌య్ సింగ్.

అగ్నివీర్ పథకం భారత మాతను, దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ పథకం దేశానికి, సైన్యానికి ద్రోహం చేయడం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ. ఈ దేశ ఎన్నిక‌లలో మోడీని తిర‌స్క‌రించార‌ని స్ప‌ష్టం చేశారు. అయోధ్య‌లో స‌మాజ్ వాది పార్టీ అభ్య‌ర్థికి ప‌ట్టం క‌ట్టార‌ని అన్నారు .