అక్రమ అరెస్ట్ లపై సింగ్ సీరియస్
కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.
సంజయ్ సింగ్ సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇవాళ పారదర్శకతతో వ్యవహరించాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు.
దేశంలో కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ ఆజాద్ సింగ్. మోదీ వచ్చాక కొద్ది మందికే లబ్ది చేకూరిందని, 140 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ ఆజాద్ సింగ్.
కేసులు నమోదు చేసినా, అరెస్ట్ లు చేసినా తాము ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఆప్ ఎంపీ.