రిజర్వేషన్లకు బీజేపీ విరుద్దం
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్
న్యూఢిల్లీ – ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి కేవలం ధనవంతులు మాత్రమే కావాలని పేదలు, బలహీన వర్గాలు అక్కర్లేదన్నారు. ఆ పార్టీ ఎంత సేపు కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు.
దేశంలో విద్వేషం రెచ్చ గొట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ఇక రిజర్వేషన్ల గురించి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని ఎద్దేవా చేశారు సంజయ్ సింగ్. దీనికి తమ వద్ద చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు.
రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు ఎంపీ. రిజర్వేషన్లు వేర్పాటు వాదాన్ని వ్యాప్తి చేస్తాయని మోహన్ వైద్య చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు పెట్టుకోవాలన్నారు.
మోడీ-బీజేపీ ఆలోచనలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న అమిత్ మాలవీయ మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.