SPORTS

శాంస‌న్ ..ప‌రాగ్ సూప‌ర్

Share it with your family & friends

ఆక‌ట్టుకున్న ఆట‌తీరు

జైపూర్ – స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో ప‌రుగుల వర‌ద పారింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , గుజ‌రాత్ జ‌ట్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో చివ‌రి బంతి వ‌ర‌కు పోటీ నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. చివ‌ర‌కు ఆఫ్గాన్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ మ‌రోసారి రాజ‌స్థాన్ పాలిట శాపంగా మారాడు.

చివ‌రి ఓవ‌ర్ లో 15 ర‌న్స్ కావాల్సి ఉండ‌గా దంచి కొట్టాడు. త‌న జ‌ట్టుకు అద్బుత విజ‌యాన్ని అందించాడు. ఇక వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఇది బిగ్ షాక్ . ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్తాన్ దుమ్ము రేపింది. ఆదిలోనే జైశ్వాల్, బ‌ట్ల‌ర్ నిరాశ ప‌రిచినా ఆ త‌ర్వాత రియాన్ ప‌రాగ్ , శాంస‌న్ ల జోడీని విడ‌దీసేందుకు గిల్ చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. మైదానం న‌లుమూలలు క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించారు.

కెప్టెన్ శాంస‌న్ చివ‌రి వ‌ర‌కు ఆడితే రియాన్ ప‌రాగ్ భారీ షాట్ ఆడ‌బోయి చివ‌రలో పెవిలియ‌న్ బాట పట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ 3 వికెట్లు కోల్పోయి 196 ర‌న్స్ చేసింది. ప‌రాగ్ 72 ర‌న్స్ చేస్తే సంజూ శాంస‌న్ 68 ప‌రుగులు చేశాడు. టోర్నీలో మూడో స్థానంలో ఉన్నాడు.