SPORTS

శాంస‌న్ కెప్టెన్సీ సూప‌ర్

Share it with your family & friends

కామెంటేట‌ర్ హ‌ర్ష బోగ్లే

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్, అన‌లిస్ట్, ర‌చ‌యిత హ‌ర్ష బోగ్లే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి ఇండియాలో జ‌రుగుతున్న మోస్ట్ పాపుల‌ర్ గేమ్ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద్బుత విజ‌యాలు న‌మోదు చేసింది. ఆ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడింది. 7 మ్యాచ్ ల‌లో గ్రాండ్ విక్ట‌రీ సాధించి 14 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

ఇక ఆ జ‌ట్టుకు సంబంధించి ప్ర‌త్యేకంగా చెప్పు కోవాల్సింది కెప్టెన్ సంజూ శాంస‌న్, కోచ్ కుమార సంగ‌క్క‌ర గురించి . ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలం నుంచీ జ‌ర్నీ చేస్తూ వ‌స్తున్నారు. గ‌త సీజ‌న్ లో ఆశించ‌నంత‌గా రాణించ‌ని వారంతా ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు.

ప్ర‌త్యేకించి ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో , కెప్టెన్సీ ప‌రంగా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు కామెంటేట‌ర్ హ‌ర్ష బోగ్లే. ప్ర‌శాంతంగా ఉంటూ ఎక్క‌డా ఒత్తిడికి లోను కాకుండా జ‌ట్టును న‌డిపించే విధాన‌నం త‌న‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకునేలా చేసింద‌న్నాడు. ఇక హ‌ర్భ‌జ‌న్ సింగ్ అయితే ఏకంగా రోహిత్ త‌ర్వాత శాంస‌న్ ను కెప్టెన్ చేయాల‌న్నాడు.