స్పిన్నర్లే కొంప ముంచారు
కెప్టెన్ సంజూ శాంసన్
చెన్నై – కేరళ స్టార్ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2024లో కీలకమైన క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో ఊహించని రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలు కావడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
అందరూ అనుకున్నట్టు తాము బాగా ఆడలేమని అనుకోవడం తప్పని పేర్కొన్నాడు సంజూ శాంసన్. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారని, ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారని కానీ 176 రన్స్ టార్గెట్ ను ఛేదించడంలో తప్పటడుగులు వేశామని ఒప్పుకున్నాడు.
తనతో పాటు ఇతర బ్యాటర్లు సరైన రీతిలో ఆడక పోవడం ఇబ్బందిగా మారిందని, దీని కారణంగానే తమ జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నాడు సంజూ శాంసన్. తనను ట్రోల్ చేస్తున్నారని ఆ విషయం తనకు తెలుసన్నాడు.
ఏ జట్టు అయినా లేదా ఏ జట్టుకు చెందిన ఆటగాడు అయినా వంద శాతం బాగా ఆడాలని అనుకుంటాడని ఎవరూ కావాలని ఓటమి చెందాలని అనుకోరన్నాడు సంజూ శాంసన్. గెలుపొందిన జట్టుకు అభినందనలు తెలిపాడు. మొత్తంగా స్పిన్నర్ల ధాటికి తాము కుప్ప కూలడం బాధను కలిగించిందన్నాడు కెప్టెన్.