కొంప ముంచిన అంపైర్ నిర్ణయం
సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఆగ్రహం
న్యూఢిల్లీ – ఒకే ఒక్క నిర్ణయం ఆట స్వరూపాన్నే మార్చేస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఐపీఎల్ 2024లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఢిల్లీ . నిర్ణీత 20 ఓవర్లలో 221 రన్స్ చేసింది.
అనంతరం మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయి 221 రన్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోయినా ఎక్కడా తగ్గలేదు కెప్టెన్ సంజూ శాంసన్. 46 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 86 రన్స్ చేశాడు. ఐపీఎల్ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా 200 సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు శాంసన్.
ఇదే సమయంలో 86 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయాడు సంజూ. బౌండరీ లైన్ వద్దకు వెళ్లింది బాల్. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినా సంజూ శాంసన్ కొద్ది సేపు మైదానంలోనే ఉన్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్త్ జిందాల్ అవుట్ హెయిన్ అని అరవడం కనిపించింది.
మొత్తంగా సంజూ శాంసన్ నెట్టింట్లో వైరల్ గా మారాడు. మరోసారి సెంచరీ కాకుండా బలి చేశారంటూ ఆరోపించారు ఫ్యాన్స్. మాజీ క్రికెటర్ సిద్దూతో పాటు పలువురు దీనిని తీవ్రంగా తప్పు పట్టారు. బాల్ తీసుకున్న సమయంలో క్రికెటర్ కాలు బౌండరీ లైన్ ను తాకిందని , అయినా ఔట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.