శాంసన్ జట్టు కోసం ఆడతాడు – సూర్య
అద్భుతంగా ఆడాడంటూ పాండ్యా కితాబు
దక్షిణాఫ్రికా – సౌతాఫ్రికా జట్టుతో జరిగిన కీలకమైన టి20 తొలి మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు ఓపెనర్, వికెట్ కీపర్ ..కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొని 107 సూపర్ సెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు 8 సిక్సర్లు కొట్టాడు.
భారత క్రికెట్ జట్టులో టి20 ఫార్మాట్ లో ఏకైక క్రికెటర్ వరుసగా సెంచరీలు చేయడం. వరల్డ్ వైడ్ గా ఇదే ఫీట్ సాధించిన క్రికెటర్లలో తను నాలుగో వాడు. ఇది పక్కన పెడితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఒన్ మ్యాన్ షో జరిగిందని చెప్పక తప్పదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఓ మాదిరిగా సపోర్ట్ చేశాడు . ఇక అభిషేక్ శర్మ తక్కువ రన్స్ కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అయినా ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు సంజూ శాంసన్. తన పవర్ ఏమిటో చూపించాడు. ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఎవరైనా 90 రన్స్ కు చేరుకున్నాక సెంచరీ కోసం ఆలోచిస్తారు. అంతే కాదు కాస్తా మెల్లగా, డిఫెన్స్ ఆడేందుకు చూస్తారు.
కానీ సంజూ శాంసన్ అలా కాదు. 90 రన్స్ ఉన్న సమయంలో కూడా ఫోర్లు, సిక్సర్లు కొట్టాలని, జట్టు స్కోర్ పెంచాలని చూస్తాడని ప్రశంసలు కురిపించాడు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్.