గౌతమ్ గంభీర్ పై శాంసన్ కామెంట్స్
అతడి మెంటార్ షిప్ బాగుందని
హైదరాబాద్ – బంగ్లాదేశ్ జట్టుతో హైదరాబాద్ లో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కేరళ సూపర్ స్టార్ సంజూ శాంసన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడారు శాంసన్. తాజాగా హెడ్ కోచ్ గా నియమితులైన గౌతమ్ గంభీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హెడ్ కోచ్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. శిక్షణలో భాగంగా తనకు గంభీర్ ఎన్నో సలహాలు ఇచ్చాడని, సూచనలు చేశాడని దానిని మైదానంలో అమలు చేయడం జరిగిందని చెప్పాడు సంజూ శాంసన్.
ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఒకసారి ఫెయిల్ కావడం కూడా జరిగిందన్నాడు. ఇదిలా ఉండగా కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు శాంసన్. ఇందులో 8 సిక్సర్లతో పాటు 11 ఫోర్లు కొట్టాడు. మొత్తం 111 పరుగులు చేశాడు.
టీమిండియా రికార్డ్ స్థాయి స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ పరంగా తన కెరీర్ లో టి20 ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. భారత జట్టు తరపున తను రెండో క్రికెటర్ . అంతకు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతులలో సెంచరీ సాధించాడు.