SPORTS

టెస్టుల్లో ఆడాల‌ని ఉంది – సంజూ శాంస‌న్

Share it with your family & friends

కోచ్ గంభీర్..కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు వెల్ల‌డి

హైద‌రాబాద్ – కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు టి20 , వ‌న్డే ఫార్మాట్ లో ఆడాడు కానీ ఇంకా టెస్టుల్లో ఆడిన దాఖలాలు లేవు. తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన టి20 మ్యాచ్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

కేవ‌లం 47 బంతుల్లో 111 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 సిక్స‌ర్లు 11 ఫోర్లు ఉన్నాయి. ప్ర‌పంచంలో అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల‌లో నాలుగో ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఇండియా వ‌ర‌కు వ‌స్తే రోహిత్ శ‌ర్మ త‌ర్వాత రెండో ఆట‌గాడిగా రికార్డ్ బ్రేక్ చేశాడు సంజూ శాంస‌న్ .

ఇదిలా ఉండ‌గా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన చిట్ చాట్ సంద‌ర్భంగా మాట్లాడాడు. త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశాడు. త‌ను వైట్ బాల్ తో ఆడాన‌ని ఇక రెడ్ బాల్ తో కూడా ఆడాల‌నే కోరిక ఉంద‌న్నాడు సంజూ శాంస‌న్.

ఇందుకు సంబంధించి హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ , కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు త‌న కోరిక గురించి వెల్ల‌డించిన‌ట్లు తెలిపాడు. ప్ర‌స్తుతం వికెట్ కీప‌ర్ గా, బ్యాట‌ర్ గా రాణిస్తున్నాన‌ని, అన్ని ఫార్మాట్ ల‌ల‌లో ఆడాల‌ని , త‌ను ఏమిటో ప్రూవ్ చేసుకోవాల‌ని ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు సంజూ శాంస‌న్.