SPORTS

మా ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది

Share it with your family & friends

కోహ్లిని 20 ఓవ‌ర్లు ఉండాల‌ని కోరుకున్నా

జైపూర్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ సంజూ శాంస‌న్ మీడియాతో మాట్లాడారు.

విరాట్ కోహ్లీని 20 ఓవ‌ర్ల వ‌ర‌కు ఆడాల‌ని కోరుకున్నామ‌ని, అదే ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో త‌మ విజ‌యం పూర్తి అయిన‌ట్టు తాను ముందే భావించాన‌ని తెలిపాడు. ప్ర‌ధానంగా కోహ్లీ ఇన్నింగ్స్ సింప్లీ సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చాడు.

ఇదే స‌మ‌యంలో త‌మ ముందున్న ల‌క్ష్యం 184 ర‌న్స్ ఉన్నా , ఆదిలోనే త‌మ ఆట‌గాడు జైశ్వాల్ పెవిలియ‌న్ చేరినా తాను , జోస్ బ‌ట్ల‌ర్ తో క‌లిసి దాడి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపాడు. ఆర్సీబీపై ఒత్తిడి పెంచుతూ పోతే ప‌రుగులు చేయ‌డం సుల‌భం అవుతుంద‌ని అనుకున్నాన‌ని, అదే మైదానంలో జ‌రిగింద‌న్నారు.

ఇక టాప్ ప్లేయ‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. అంతే కాదు త‌మ బాయ్స్ క‌లిసిక‌ట్టుగా రాణించార‌ని తెలిపాడు. ప్ర‌ధానంగా అశ్విన్, చాహ‌ల్ బౌలింగ్ అద్భుత‌మ‌న్నాడు. మొత్తంగా త‌మ ప్లాన్ కు ఎలాంటి ఢోకా లేద‌ని తేలి పోయింద‌న్నాడు. టాస్ గెల‌వ‌డం కూడా త‌మ‌కు లాభించింద‌ని చెప్పాడు సంజూ శాంస‌న్.