సంజూ శాంసన్ సెన్సేషన్
5 టి20 మ్యాచ్ లలో 3 సెంచరీలు
జోహనెస్ బర్గ్ – దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టి20 మ్యాచ్ లో పరుగుల వరద పారించారు భారత క్రికెటర్లు. ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకోవడం కలిసొచ్చింది. తన నిర్ణయం కరెక్టేనని నిరూపించారు యంగ్ క్రికెటర్లు.
వచ్చీ రావడంతోనే అభిషేక్ శర్మ, శాంసన్ పరుగులు చేయడం ప్రారంభించారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. జోహనెస్ బర్గ్ మైదానం నలు వైపులా కళ్లు చెదిరేలా షాట్స్ కొట్టారు. క్రికెట్ ఫ్యాన్స్ కు టి20 ఫార్మాట్ లో ఉన్న మజా ఏమిటో చూపించారు సంజూ శాంసన్, తిలక్ వర్మ, శర్మ.
నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భారత జట్టు ఏకంగా 283 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ను ఛేదించ లేక దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. సంజూ శాంసన్ రికార్డ్ సృష్టించాడు. సీరిస్ లో 2 సెంచరీలు సాధించాడు. తను 109 రన్స్ చేస్తే తిలక్ వర్మ జోరు పెంచాడు..120 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి రికార్డ్ స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
5 టి20 మ్యాచ్ లలో మూడు సెంచరీలు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు దక్షిణాఫ్రికా టూర్ లో చేయగా మరో సెంచరీ ఇండియాలోని హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన శతకంతో అలరించాడు.
అర్ష్ దీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ దెబ్బకు సఫారీలు విల విల లాడారు. పెవిలియన్ బాట పట్టారు.