సంజూ షాన్ దార్ షో
8 ఫోర్లు 6 సిక్సర్లు 86 రన్స్
న్యూఢిల్లీ – బీసీసీఐ సెలెక్టర్లకు తన సత్తా ఏమిటో చూపించాడు కేరళ స్టార్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ పోరులో రాజస్థాన్ ఓటమి పాలైంది. కానీ మ్యాచ్ ఢిల్లీ గెలిచినా చివరకు ఒంటరి పోరాటం చేసిన సంజూ శాంసన్ హీరోగా మిగిలి పోయాడు. ఓ వైపు వికెట్లు కూలుతున్నా ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. వివాదాస్పదమైన నిర్ణయంతో అద్భుతమైన ఇన్నింగ్స్ కు తెర పడటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఒక్క నిర్ణయం ఆ జట్టు ఓటమికి బాటలు వేసిందని చెప్పక తప్పదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే
నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 221 రన్స్ చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి. ప్రధానంగా ఫ్రేజర్ , పొరెల్ , స్టబ్స్ ఆకాశమే హద్దుగా ఆడారు.
ఢిల్లీ జట్టులో అభిషేక్ పొరెల్ 36 బంతులు ఎదుర్కొని 65 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. జేక్ ఫ్రేసర్ 20 బంతులలో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. స్టబ్స్ 20 బాల్స్ ఎదుర్కొని 41 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ,3 సిక్సర్లు ఉన్నాయి.
అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ ఆదిలోనే జైశ్వాల్ వికెట్ ను పారేసుకుంది. మైదానంలోకి వచ్చిన సంజూ శాంసన్ ఎక్కడా తగ్గలేదు. 46 బంతులు ఎదుర్కొని 86 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. రియాన్ పరాగ్ ఒక్కడే రాణించాడు. మిగతా వారు ఎవరూ ఆశించిన మేర సత్తా చాటలేక పోయారు.