సంజూ శాంసన్ సెన్సేషన్
42 బంతుల్లో 69 రన్స్
జైపూర్ – రాజస్థాన్ లోని జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టి కరిపించింది. 184 పరుగుల భారీ స్కోర్ ను అవలీలగా ఛేదించింది.
ఆదిలో లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వికెట్ ను కోల్పోయినా ఎక్కడా తడబాటుకు లోను కాలేదు. మైదానంలోకి దిగిన స్కిప్పర్ సంజూ శాంసన్ జోస్ బట్లర్ తో కలిసి పరుగుల వరద పారించాడు. ఓవైపు బట్లర్ ఎడా పెడా బాదుతుంటే తానేమీ తక్కువ కాదని ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డారు. సిరాజ్ బౌలింగ్ లో తను కొట్టిన షాట్ కు ప్రత్యర్థి జట్టు విస్తు పోయింది.
జోస్ బట్లర్ 58 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 4 సిక్సర్లతో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 42 బాల్స్ ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతో 69 రన్స్ చేసి ఆఖరున అవుట్ అయ్యాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్ లు గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది.