SPORTS

శాంస‌న్ షాన్ దార్ షో

Share it with your family & friends

33 బంతుల్లో 71 రన్స్

యూపీ – వేదిక ఏదైనా స‌రే అంతిమంగా త‌మ‌దే విజ‌య‌మ‌ని స్ప‌ష్టం చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. కుమార సంగ‌క్క‌ర మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆ జ‌ట్టు రాయ‌ల్స్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2024లో మోస్ట్ పాపుల‌ర్ కెప్టెన్ గానే కాకుండా అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్.

ఈ 17వ సీజ‌న్ లో 9 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. ఈ విజ‌యాల‌లో సంజూ శాంస‌న్ పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కార‌ణం త‌న ఆట తీరుతోనే కాదు అద్బుత‌మైన నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చ‌డం.

197 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 19 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ పూర్తి చేసింది. ఒకానొక ద‌శ‌లో 78 ప‌రుగుల‌కే 3 కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయి ఇబ్బందుల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో సంయ‌మ‌నంతో ఆడుతూ జ‌ట్టును ద‌గ్గ‌రుండి గెలిపించాడు కెప్టెన్ సంజూ శాంస‌న్.

ధ్రువ్ జురైల్ తో క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు స్కిప్ప‌ర్. సంజూ శాంస‌న్ 33 బంతులు ఎదుర్కొని 71 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ధ్రువ్ జురైల్ 34 బాల్స్ ఎదుర్కొని 52 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.
ఇక బ‌ట్ల‌ర్ 34 ర‌న్స్ చేస్తే జైశ్వాల్ 24 ప‌రుగులు చేశాడు.