SPORTS

నెట్టింట్లో శాంస‌న్ ట్రెండింగ్

Share it with your family & friends

సెలెక్ట‌ర్ల‌పై పెరిగిన ఒత్తిడి

ముంబై – మ‌రోసారి ఐపీఎల్ 2024 లీగ్ జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా క్రికెట్ ప్రేమికులు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ వైపు చూస్తోంది. దాయాది పాకిస్తాన్ లో సైతం శాంస‌న్ ప‌ట్ల ప్రేమికులు అత‌డికి మ‌ద్ద‌తు తెలుపుతుండ‌డం విశేషం.

ప్ర‌స్తుతం అంద‌రి క‌ళ్లు బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌పై ప‌డింది. శాంస‌న్ విష‌యంలో ఇప్ప‌టికే స‌స్పెండైన చేత‌న్ శ‌ర్మ నోరు పారేసుకున్నాడు. కావాల‌ని సంజూను ప‌క్క‌న పెడుతున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పాడు. ఇదంతా ప‌క్క‌న పెడితే ముంబై లాబీయింగ్ ఎక్కువ‌గా ప‌ని చేస్తోంది. ప్ర‌ధానంగా కార్పొరేట్ కంపెనీల స‌పోర్ట్ కూడా పంత్ , కేఎల్ రాహుల్ , సందీప్ కిష‌న్ ప‌ట్ల ఉంటోంది.

ప్ర‌ధానంగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాపై తీవ్ర స్థాయిలో క్రికెట్ ఫ్యాన్స్ భ‌గ్గుమంటున్నారు. ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుత ఐపీఎల్ లో నెంబ‌ర్ వ‌న్ లో కొన‌సాగుతోంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ . కెప్టెన్ గా టాప్ లో కొన‌సాగేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టోర్నీలో 9 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్ లు గెలుపొందింది. ఇందులో కెప్టెన్ సంజూ శాంస‌న్ 385 ర‌న్స్ చేశాడు. యావ‌రేజ్ 77 శాతంగా ఉంటే స్ట్రైక్ రేట్ 161 గా ఉంది. కేఎల్ , పంత్ కంటే ఎక్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం త‌ను నెట్టింట్లో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాడు.