అమెరికాలో శాంసన్ మేనియా
మాములుగా లేదుగా మనోడికి
యుఎస్ఏ – కేరళ క్రికెటర్ , యంగ్ స్టార్ , మోస్ట్ పాపులర్ ఐకాన్ గా గుర్తింపు పొందిన సంజూ శాంసన్ మరోసారి వైరల్ గా మారారు. తను ఐపీఎల్ లోసారి దుమ్ము రేపాడు. తను ముందుండి జట్టును నడిపించాడు. అంతే కాదు భారీ ఎత్తున పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్ లోకి తీసుకు వెళ్లేలా చేశాడు. కానీ ఊహించని రీతిలో సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్.
వ్యక్తిగత పరుగుల జాబితాలో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ కు ఊహించని రీతిలో మద్దతు లభించింది. ఇదే సమయంలో తనను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసేలా చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షెన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సంచలన ప్రకటన చేశాడు.
టీమిండియా 11 మంది కీలక ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకడు అని స్పష్టం చేశాడు. దీంతో అరుదైన ఛాన్స్ దక్కింది సంజూ శాంసన్ కు. ఇదే తన కెరీర్ కు ఆఖరి ఛాన్స్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఈ నెలలో ఐసీసీ టి20 వరల్డ్ కప్ జరగనుంది. అమెరికా, విండీస్ సంయుక్తంగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి.
తాజాగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన శాంసన్ కు అమెరికన్లు సైతం ఫిదా అవుతున్నారు. అతడి ఫోటోలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.