NEWSNATIONAL

రాహుల్ గాంధీ ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌డు

Share it with your family & friends

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

ముంబై – శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ కేవ‌లం ప్ర‌తిపక్ష నాయ‌కుడు మాత్ర‌మే కాద‌ని ఆయ‌న భార‌త దేశంలో మోడీని ఎదుర్కొనే ద‌మ్మున్న లీడ‌ర్ అని పేర్కొన్నారు. ఆయ‌న ఎవ‌రికీ భ‌య‌ప‌డే ర‌కం కాద‌న్నారు. యావ‌త్ భార‌త దేశ‌మంతా రాహుల్ గాంధీ వైపు ఉంద‌ని చెప్పారు.

ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా దెబ్బ తిన్న‌ద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సంజ‌య్ రౌత్.

భార‌తీయ జ‌న‌తా పార్టీ, మోడీ ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా రాహుల్ గాంధీ గురించి ఎంత‌గా డ్యామేజ్ చేసినా ఒరిగింది ఏమీ ఉండ‌ద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని , ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని సెల‌విచ్చారు శివ‌సేన సీనియ‌ర్ నేత , ఎంపీ.