సన్నతి మిత్రా డ్యాన్స్ వైరల్
ఇండియా గేట్ వద్ద టవల్ తో
ఢిల్లీ – ఎవరీ సన్నతి మిత్రా అనుకుంటున్నారా. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది ఈ అమ్మడు. ఈ మధ్యన రీల్స్ పిచ్చి ఎక్కువైంది జనాలకు. ప్రత్యేకించి యువతీ యువకులు వీటి పట్ల మోజు పెంచుకుంటున్నారు. ఎలాంటి కష్టం లేకుండానే ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనే వీరిని ఇలా చేసేలా చేస్తోంది.
తాజాగా సన్నతి మిత్రా అనే యువతి ఏకంగా దేశ చరిత్రలో ప్రత్యేకించి ఢిల్లీ నగర చరిత్రలో కీలకమైన ప్రాంతంగా పేరుంది ఇండియా గేట్ కు. విదేశీ, దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఇది ఆకర్షిస్తూ వస్తోంది. అంతే కాకుండా ఢిల్లీ ప్రభుత్వానిక భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది.
దీంతో చాలా మంది యూట్యూబర్స్, రీల్స్ ఇన్ ఫ్యూయర్స్ ఎక్కువగా ఇండియా గేట్ ను ఎంచుకుంటున్నారు. పర్యాటకులు, ఇతరులు చూస్తూ ఉండగానే సన్నతి మిత్రా కేవలం టవల్ తో మాత్రమే డ్యాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నం చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు పెద్ద ఎత్తున నెట్టింట్లో సర్క్యూలేట్ అయ్యాయి. ఇదంతా
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జరుగుతోందని చెప్పక తప్పదు. సెర్చ్ చేస్తే సన్నతి మిత్రా కోల్ కతాకు చెందిన వ్యక్తిగా తేలింది. తనంతకు తానుగా మోడల్ నని, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేర్కొంది. బికినీ వేసుకుని డ్యాన్సు చేయడం మరింత ఎబ్బెట్టుగా అనిపించింది.