సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యోధుడు
నివాళులు అర్పించిన సీఎం..కేటీఆర్
హైదరాబాద్ – తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. ఆగస్టు 17న పాపన్న గౌడ్ జయంతి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని తెలిపారు.
సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి కృషిని, పట్టుదలను, వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన తరుణమిదని స్పష్టం చేశారు కేటీఆర్.
కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.
విశ్వ కీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించు కునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వ హించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాల సాధన కు శక్తి వంచన లేకుండా కృషి చేశామని స్పష్టం చేశారు.