చీఫ్ కోఆర్డినేటర్ సర్జిస్ ఆలం ప్రకటన
బంగ్లాదేశ్ – షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసనలకు సారథ్యం వహించిన ఉద్యమ నేత సర్జిస్ ఆలం సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి బంగ్లాదేశ్ దేశానికి కొత్త రాజ్యాంగం ఖురాన్ ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తూర్పు పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ మార బోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు, వారికి చెందిన ఆస్తులు, ప్రార్థనా స్థలాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి నిరసనకారులు బంగ్లాదేశ్ అంతటా షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఆందోళనలు చల్లారడం లేదు. విపక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా సర్జిస్ ఆలం కొనసాగుతున్నారు. దేశానికి చెందిన వనరులను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
“ఈ స్వేచ్ఛ బంగ్లాదేశ్ ప్రజలకు చెందినది” అని ఆలం నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హింసకు పాల్పడవద్దని, ఇప్పటికే హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సైన్యానికి సహకరించాలని పౌరులను కోరారు.