సతీష్ చందర్..జూలూరి గౌరీశంకర్
హైదరాబాద్ – ప్రజల పక్షపాతి విద్యా భూషణ్ అన్నారు ప్రముఖ సంపాదకుడు సతీష్ చందర్. రచయితగా, జర్నలిస్టుగా నిబద్దతతో పని చేశారని కొనియాడారు. విద్యా భూషణ్ సంతాప సభ ఎస్వీకేలోని దొడ్డి కొమరయ్య హాల్ లో జరిగింది. విప్లవ పార్టీలు, బంధుమిత్రులు కలిసి సంతాప సభ నిర్వహించారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి జి ఝాన్సీ అధ్యక్షతన పాత్రికేయ సంపాదకులు టంకశాల అశోక్ , సీనియర్ సంపాదకులు సతీష్ చందర్, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, జూలూరు గౌరి శంకర్, న్యూ డెమోక్రసీ సెక్రటేరియట్ సభ్యులు గోవర్ధన్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేశ్, విద్యా భూషణ్ కుమారుడు ఆజాద్ ,కూతురు సంధ్య తదితరులు ప్రసంగించారు.
సీనియర్ సంపాదకులు టంక శాల అశోక్ మాట్లాడుతూ విద్యా భూషణ్ అసాధారణమైన జర్నలిస్టు అన్నారు. ప్రజల పక్షపాతిగా వార్తలు రాసేవారన్నారు. తన సహచరుడుగా కలిసి పని చేసిన అనుభవం తనకు ఉందన్నారు .
సతీష్ చందర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన నిజాయితీతో కూడిన జర్నలిస్టు అన్నారు. ఆదిలో విప్లవ రాజకీయాలతో ప్రారంభమై వృత్తి మారినా రాజకీయాలు వదల లేదన్నారు. జీవితాంతం ఆదర్శనీయుడుగా కొనసాగాడు అన్నారు. ఎంతో మంది గతంలో ఉన్నవారు వామపక్షాలను వదిలేసి పోయినా విద్యా భూషణ్ మాత్రం అలాగే నిలబడి పోయాడని కొనియాడారు.
ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యా భూషణ్ ఇలా అర్ధాంతరంగా వెళ్లి పోతాడని అనుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సామాజిక పత్రిక ఏర్పాటుపై పరితపించి వీక్షణం పత్రిక స్థాపనలో కీలక పాత్ర పోషించాడని చెప్పారు.
V హనుమంతరావు నాయకత్వంలో సామాజిక, ఆర్థిక ,రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగాడని అన్నారు. 15- 20 సంవత్సరాల కాలంలో 70 వ్యాసాలను వీక్షణం పత్రికకు రాయడం గర్వంగా ఉందన్నారు. కే గోవర్ధన్, ఎం హన్మేశ్ మాట్లాడుతూ శ్రీకాకుళ ఉద్యమ ప్రస్థానంలో ప్రారంభమై కొంతకాలం వృత్తి విప్లవకారుడుగా కొనసాగాడని అన్నారు.
ప్రజా పంథా ,న్యూ డెమోక్రసీ, మాతృక, తిరుగుబాటు పత్రికలకు అనేక వ్యాసాలు రాశారని తెలిపారు. జర్నలిస్టుగా ఉన్నా ,విప్లవ కార్యకర్తగా ఆలోచనలు చేసేవాడు అన్నారు. ఆయన నిజాయితీని, నిబద్ధతను, నిస్వార్థతను కొనియాడాలన్నారు.
జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతి చేసేవాడు అన్నారు.