NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డికి స‌త్య కుమార్ యాద‌వ్ స‌వాల్

Share it with your family & friends

క‌డ‌ప ప్ర‌జ‌లు వైఎస్సార్ పేరు పెట్ట‌మ‌న్నారా

అమ‌రావ‌తి – ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. వైసీపీ పార్టీపై, ఆ పార్టీకి చెందిన బాస్ , మాజీ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు.

తాను ఏం డిమాండ్ చేశాన‌నేది ప‌రిశీలించ‌కుండానే త‌న ప‌రివారంతో త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు స‌త్య కుమార్ యాద‌వ్.

హిందూ దేవుళ్ల, దేవాలయాల పవిత్రతను అడుగడుగునా తగ్గించే ప్రయత్నం చేసింది మీ స‌ర్కార్ కాదా అని ప్ర‌శ్‌నించారు. కడప జిల్లా పేరు మార్చి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కన్నా ‘వ్యక్తి’ గొప్ప అని చూపే ప్రయత్నం చేసింది నిజం కాదా అని నిల‌దీశారు మంత్రి.

జిల్లాకు ‘కడప’ లేదా ‘దేవుని కడప’ అన్న పేరు మాత్రమే ఉండాలని ప్రజల అభిప్రాయం అని స్ప‌ష్టం చేశారు. అయినప్పటికీ వైఎస్సార్ పేరు తొలగించమని తాను ఎక్కడా కోర లేద‌న్నారు స‌త్య కుమార్ యాద‌వ్.

కడప పేరు చేర్చి తప్పు సరిదిద్దాలని కోరినందుకు ‘అంజాద్ బాషా’ లాంటి మతోన్మాదులతో నాపై విమర్శలు చేయిస్తున్నారని మండిప‌డ్డారు.

దేవుడు గొప్పా, వ్యక్తి గొప్పా అన్న విషయంపై ప్రజల మధ్య బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నాన‌ని మ‌రి వైసీపీ నేత జ‌గ‌న్ రెడ్డి సిద్ద‌మా అని స‌వాల్ విసిరారు స‌త్య కుమార్ యాద‌వ్.