NEWSANDHRA PRADESH

ఆరోగ్య పాల‌సీల‌కు కేబినెట్ ఆమోదం

Share it with your family & friends

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ వెల్ల‌డి

అమ‌రావ‌తి – ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ త‌మ ప్ర‌భుత్వం ఆరోగ్య రంగానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ మీటింగ్ జ‌రిగింద‌ని తెలిపారు. స‌మావేశం అనంత‌రం స‌త్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా ఆరోగ్య రంగానికి సంబంధించి ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, మారిటైమ్ పాలసీలపై చర్చించి ఆమోదించడం జరిగింద‌ని వెల్ల‌డించారు స‌త్య కుమార్ యాద‌వ్. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సరవణకు కేబినెట్ ఓకే చెప్పింద‌ని తెలిపారు.

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సమీకృత పర్యాటక పాలసీ, స్పోర్ట్స్ పాలసీలలో మార్పులపైనా చర్చ జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు స‌త్య కుమార్ యాద‌వ్.