NEWSANDHRA PRADESH

ఏపీలో పెట్టుబ‌డులకు భారీ అవ‌కాశాలు

Share it with your family & friends

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ వెల్ల‌డి

అమ‌రావ‌తి – ఏపీలో పెట్టుబ‌డుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. అబుదాబి ఎంఎఫ్‌2 సంస్థ ప్ర‌తినిధులు ఇవాళ మంత్రితో భేటీ అయ్యారు. ఈ స‌మావేశం సానుకూలంగా స్పందించింద‌న్నారు మంత్రి. మ‌రోసారి ప్ర‌తినిధులు హాజ‌రు కానున్న‌ట్లు తెలిపారు. తుది నివేదిక అనంత‌రం ఎంఓయూ చేసుకుంటామ‌న్నారు.

ఇందులో భాగంగా ఏపీలో 3 ఎక‌న‌మిక్ కారిడార్లు, 9 పుర పాలిక సంఘాల్లోని హెల్త్ హ‌బ్ లు , అమ‌రావ‌తి హెల్త్ సిటీలో ఇన్వెస్ట్ మెంట్స్ కు చాలా అవ‌కాశాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు స‌త్య కుమార్ యాద‌వ్.
రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అపార‌మైన అవ‌కాశాలు, వ‌న‌రులు ఉన్నాయ‌ని అబుదాబికి చెందిన ఎంఎఫ్‌2 సంస్థ ప్ర‌తినిధులకు వివ‌రించామ‌న్నారు.

జినోమిక్స్‌, ప‌ర్యావ‌ర‌ణ మెడ్ టెక్‌, బ‌యోటెక్ విభాగాల్లో అపార‌మైన అనుభ‌వ‌మున్న ఎంఎఫ్‌2 సంస్థ‌తో ప్రాథ‌మికంగా చ‌ర్చించామ‌న్నారు. వ్యాపార ప‌రంగా, సేవా ప‌రంగా ఏపీలో ఉన్న అవ‌కాశాల్ని సంస్థ ప్ర‌తినిధుల‌కు తెలిపిన‌ట్లు చెప్పారు.

ఏపీలో బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్ మొద‌టి స్థానంలో ఉన్న విష‌యాన్ని, అలాగే సుమారు 170 ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న ఎపి మెడ్ టెక్ జోన్‌, కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన 3 ఎక‌న‌మిక్ జోన్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు మెండుగా ఉన్న అవ‌కాశాల‌పైనా వారితో చ‌ర్చించామ‌న్నారు.

అమ‌రావ‌తి ప్రాంతంలో హెల్త్ సిటీలో గానీ, ఎంపిక చేసిన 9 మునిసిపాలిటీల్లో హెల్త్ హ‌బ్ ల‌లో కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశ‌ముంద‌ని మంత్రి స‌త్య‌కుమార్ చెప్పారు. ఆసుప‌త్రుల నిర్మాణాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉత్సాహాన్ని క‌న‌బ‌ర్చ‌డ‌మే కాకుండా ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల్ని మెరుగుప‌ర్చే స‌రికొత్త టెక్నాల‌జీ అయిన జీనోమ్‌ సీక్వెన్సీ గురించి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌న్నారు.