Saturday, May 24, 2025
HomeNEWSANDHRA PRADESHరోగుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి – వైద్య‌శాల‌ల‌కు వ‌చ్చే రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఆసుపత్రికి వస్తే వైద్యం బాగా అందిస్తారని నమ్మకం కలిగించేలా కృషి చేయాల‌ని కోరారు. శుక్రవారం కాకినాడలోని నూకాలమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవిని ఆసుపత్రిని మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వైద్యం పేదలకు చాలా దూరంలో ఉందన్నారు. దాని వల్ల పేద ప్రజల రకాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పేద ప్రజలు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులను, సేవలను పెంచి వాటిని మెరుగు పరుస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ఎలక్షన్ చేసి వైద్యం దూరం చేసింది అన్నారు .

మేడ్వే సంజీవని ఆసుపత్రిలో ఇంకా పేదలకు ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవలు తెల్లకార్డుదారులకు అందించేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను మంత్రి దృష్టిలో ప్రస్తావించగా దీనిపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర రావు (నానాజీ), సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు), మెడ్వే వ్యవస్థాపకుడు టి పలనియప్పన్, మెడ్వే సంజీవని ఆసుపత్రి అధినేత డాక్టర్ నెక్కంటి సూర్య ప్రకాష్ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments