కేటీఆర్ ను ఫాలో అయిన కేతిరెడ్డి
ఎద్దేవా చేసిన మంత్రి సత్య కుమార్
అనంతపురం జిల్లా – ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడో తనకు అర్థం కావడం లేదంటూ ఢిల్లీలో కేటీఆర్ మీడియా సందర్బంగా చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు.
బుధవారం మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు చేసిన దోపిడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. భూ దోపిడీకి తెర తీశారని, అందుకే జనం మిమ్మల్ని బండకేసి కొట్టారని అన్నారు సత్య కుమార్ యాదవ్.
గుడ్ మార్నింగ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని ఫాలో అయ్యాడని, చాలా తెలివిగా భూ కబ్జాలకు తెర తీశాడని మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు.. తెలంగాణలో మీరు, ఆంధ్రాలో జగన్, ధర్మవరంలో కేతిరెడ్డి భూదోపిడీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సత్య కుమార్ యాదవ్.
ఇకనైనా మాట్లాడేటప్పుడు కొంచెం సోయి తెచ్చుకుని కేటీఆర్ మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు మంత్రి.