కాంగ్రెస్ నిర్ణయం మాలిక్ హర్షం
బీజేపీ అత్యంత ప్రమాదకరం
న్యూఢిల్లీ – జమ్మూ కాశ్మీర్ , మేఘాలయ రాష్ట్రాల మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శర్మ అమేథీని ఎంపిక చేయడంపై స్పందించారు. ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విచిత్రం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ డబ్బులు ఉన్న వాళ్లకు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి ఎక్కువగా సీట్లు కేటాయించిందని ఆరోపించారు సత్య పాల్ మాలిక్.
అయితే బీజేపీ కూటమికి బిగ్ షాక్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత సామాన్యమైన సాదా సీదా కార్యకర్తకు సీటు కేటాయించడం అభినందనీయమని ప్రశంసించారు.
అమేథీ నుంచి శర్మ తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ మాయ మాటలను నమ్మడం లేదని స్పష్టం చేశారు సత్యపాల్ మాలిక్. వ్యవస్థలను నాశనం చేసి , ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు.