NEWSNATIONAL

దేశ రాజ‌కీయాల‌పై మ‌రాఠా ఎన్నిక‌ల ఎఫెక్ట్

Share it with your family & friends

మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ కామెంట్స్

ముంబై – మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ స‌మావేశంలో శివ సేన బాల్ థాక‌రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా స‌త్య పాల్ మాలిక్ మ‌రాఠాలో జర‌గ‌నున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. ఆయ‌న గ‌త కొంత కాలం నుంచీ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌తం పేరుతో చేస్తున్న రాజ‌కీయాన్ని త‌ప్పు ప‌డుతూ వ‌స్తున్నారు. ఆయ‌న బేష‌ర‌తుగా రాహుల్ గాంధీ జోడో యాత్ర‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌ను ఏకి పారేస్తూ వ‌స్తున్నారు.

వాళ్లు దేశ అభివృద్దికి నిరోధ‌కులుగా మారారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు కీల‌కంగా మార‌నున్నాయ‌ని పేర్కొన్నారు స‌త్య పాల్ మాలిక్.

రాబోయే రోజుల్లో దేశ‌మంతా మరాఠాను చూస్తున్నాయ‌ని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేస్తాయని స్ప‌ష్టం చేశారు సత్యపాల్ మాలిక్. (PHOTO COURTSY PTI)