మంత్రి స్పందన కేటీఆర్ నిరాకరణ
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ప్రశంసలు
హైదరాబాద్ – రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకోవడంలో టాప్ లో కొనసాగుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్.
ఆయన ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. దీనికి కారణం తను ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొలువు తీరిన ధర్మవరం ఎమ్మెల్యే , భారతీయ జనతా పార్టీకి చెందిన సత్య కుమార్ యాదవ్ ను ట్విట్టర్ లో బ్లాక్ చేయడమే. దీనిపై పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం అవుతోంది.
నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్బంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ధర్మవరం శాసన సభ నియోజకవర్గంలో ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి చేతిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడి పోవడం తనను విస్మయానికి గురి చేసిందన్నారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. కేతిరెడ్డి గురించి ఏం తెలుసని కేటీఆర్ అలా అంటాడంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో తను మంత్రిగా ఉన్న సమయంలో ధరణి పేరుతో ఎలా మోసం చేశారో ప్రజలకు తెలుసని, అందుకే బీఆర్ఎస్ ను ఓడించారంటూ పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలోంచి సత్యకుమార్ యాదవ్ ను బ్లాక్ చేశారు. ఇది హాట్ టాపిక్ గా మారింది.