మెరుగైన వైద్య సేవలు అందిస్తాం
ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి – రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఏపీ నూతన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్య కుమార్ యాదవ్. ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు భారతీయ జనతా పార్టీ నుంచి.
ఆదివారం సచివాలయం లోని 5వ బ్లాక్ లో తనకు కేటాయించిన గదిలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన రంగాలను పట్టించు కోలేదని, దీంతో అవి నీరుగారి పోయి ఉన్నాయని వాపోయారు. తమ పాలనలో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేపడతామని ప్రకటించారు సత్య కుమార్ యాదవ్. పేదలకు మరింత ఉన్నతమైన సేవలు అందించడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.