Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీ మౌలిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట

ఏపీ మౌలిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట

కేంద్రానికి స‌త్య కుమార్ యాద‌వ్ థ్యాంక్స్

అమరావ‌తి – ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర మంత్రివ‌ర్గం గురువారం ఏక‌గ్రీవంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైల్వే లైన్ నిర్మాణంతో పాటు ఇత‌ర ప‌నులు చేప‌ట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణ‌వ్, నితిన్ గడ్క‌రీ, అమిత్ షాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఏపీకి ముమ్మాటికి అమ‌రావ‌తినే రాజ‌ధాని అని స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో భాగంగా మొత్తం 9 స్టేష‌న్ల‌తో 57 కిలోమీట‌ర్ల మేర రూ. 2,245 కోట్ల పెట్టుబ‌డికి ఆమోదం తెలప‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు స‌త్య కుమార్ యాద‌వ్.

అంతే కాకుండా కృష్ణా న‌ది పై 3.2 కిలోమీట‌ర్ల వంతెన‌కు కూడా ఆమోదం తెలిపినందుకు గ‌డ్క‌రీకి థ్యాంక్స్ తెలిపారు. దీని వ‌ల్ల హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా , నాగ్‌పూర్‌లకు నేరుగా రైలు మార్గాలు ఏర్ప‌డ‌తాయ‌ని, రాక పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండ‌వ‌న్నారు మంత్రి.

ఇదే స‌మ‌యంలో పరిటాల స్టేషన్‌లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్ప‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ మంగళగిరిలోని ఏపీఐఐసీలో ఉన్న ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంస్థ నుంచి జరిగే మందుల సరఫరా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments