రాహుల్ గాంధీ ప్రజల గొంతుక
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
ఢిల్లీ – జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని మోడీని ఉద్దేశించి మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇవాళ దేశంలో అరాచక, ఏక వ్యక్తి పాలన కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్.
ప్రతిపక్షాలు ఐక్యమత్యంతో ఉండాలని సూచించారు. రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, ఆటో రిక్షా డ్రైవర్లు, కూరగాయలు అమ్మే వారు..ఇలా ప్రతి ఒక్కరి తరపున మాట్లాడుతున్నది కేవలం ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు.
ప్రతి వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నవిస్తూ రాహుల్ గాంధీ కష్టపడి పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆదివారం సత్యపాల్ మాలిక్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాలని సూచించారు.
తమ రాష్ట్రాల్లో కష్టపడి పేదల గొంతుకను బలంగా వినిపించినట్లయితే, అతి త్వరలో పాత శకం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మోదీ ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు గుప్పిస్తున్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు. రాహుల్ గాంధీ నిజమైన ప్రతిపక్షం అని స్పష్టం చేశారు సత్య పాల్ మాలిక్.