పవన్ జోక్యంతో కార్మికులకు జీతాలు రిలీజ్
సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన డిప్యూటీ సీఎం
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో పాలన సాగిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది.
ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తమకు వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు.
ఏడు నెలలుగా ఎందుకు జీతాలు చెల్లించడం లేదంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రశ్నించారు. వెంటనే బకాయి పడిన రూ. 30 కోట్లను రిలీజ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి బి.ఆర్.ఓ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు ఈ స్కీం ద్వారా తాగు నీరు అందుతోంది. ఈ స్కీం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే 536 మంది కార్మికులకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు నిలిచి పోయాయి.