బీఆర్ఎస్ నేతలపై దాడులు అరికట్టండి
డీజీపీని కలిసిన సత్యవతి రాథోడ్
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరాక తమ వారిపై పనిగట్టుకుని దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ సందర్బంగా వెంటనే తమ వారికి రక్షణ కల్పించాలని, దాడులు చేయకుండా అడ్డు కోవాలని కోరారు. ఈ మేరకు సత్య వతి రాథోడ్ తో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు డీజీపీ రవి గుప్తాను కలిశారు. వినతిపత్రం సమర్పించారు.
దాడులకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పించడం జరిగిందన్నారు సత్యవతి రాథోడ్. ఇటీవల ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ల పై జరిగిన దాడి జరిగిందన్నారు. అంతే కాకుండా కొందరిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మహిళలపై దాడులు పెరిగి పోయాయని, వీటిపై ఫోకస్ పెట్టాలన్నారు మాజీ మంత్రి. మహిళలపై దాడులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై పనిగట్టుకుని దాడులు చేస్తున్న వారిపై విచారణ చేపట్టాలని కోరారు డీజీపీని.