NEWSNATIONAL

బీజేపీ పాల‌న కాదు బ్రిటీష్ పాల‌న – జైన్

Share it with your family & friends

మాజీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ కామెంట్

ఢిల్లీ – ఆప్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ త‌న‌ను అరెస్ట్ చేసింది. దీంతో 873 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు.

అక్టోబ‌ర్ 18న శుక్ర‌వారం ఢిల్లీ కోర్టు స‌త్యేంద‌ర్ జైన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంట‌నే త‌ను నేరుగా ఆప్ చీఫ్ , మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నివాసంలో క‌లుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని బ్రిటీష్ రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు జైన్.

ఇవాళ దేశ వ్యాప్తంగా అప్ర‌క‌టిత‌, అణ‌చివేత కొన‌సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌ని చేయ‌డంలో ప్ర‌భుత్వాలు పోటీ ప‌డాలి కానీ ప‌ని బీజేపీ ఆ ప‌ని చేయ‌ద‌న్నారు. మ‌న‌ల్ని ప‌ని చేయ‌నీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు స‌త్యేంద‌ర్ జైన్.

తాను ఆరోగ్య శాఖ మంత్రిగా పేద‌లు, సామాన్యుల కోసం మొహ‌ల్లా క్లినిక్ లు, ఆస్ప‌త్రుల‌ను నిర్మించినందుకు త‌న‌ను అరెస్ట్ చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఏది ఏమైనా ఏ పార్టీలో ఉన్నా దేశ సంక్షేమం కోసం పాటు ప‌డాల‌ని పేర్కొన్నారు.