తొలిసారి షో చేపట్టిన వైనం
సౌదీ అరేబియా – ప్రపంచాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియా కొత్తగా ఆలోచిస్తోంది. తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఫోకస్ పెట్టింది . ఇందులో భాగంగా పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్లాన్ చేసింది. ఇది వర్కవుట్ అయ్యింది. టూరిజం పరంగా భారీ ఎత్తున ఆదాయం సమకూర్చే పనిలో పడింది.
ఈ మేరకు సౌదీ అరేబియాలో తొలిసారిగా స్విమ్ వేర్ ఫ్యాషన్ షోను చేపట్టింది. ఇందులో మొరాకో డిజైనర్ యాస్మినా కాస్టల్ పని చేసింది. ఈ షోకు భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఇప్పటి వరకు మహిళలు బికినీలు ధరించ కూడదని ఇక్కడి సర్కార్ నిషేధం విధించింది. ఎవరైనా ముఖం వరకు మాత్రమే దుస్తులు ధరించాలని ఆదేశించింది.
కానీ ఉన్నట్టుండి ఫ్యాషన్ షో నిర్వహించడం విస్తు పోయేలా చేసింది. ఇక్కడ ఫ్యాషన్ పరిశ్రమ వ్యాపారం రూ. 12.5 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది. ఈ దేశం చాలా సాంప్రదాయకమైనదనేది వాస్తవం. కానీ అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విట్ సూట్ లను చూపించాలని తాము ప్రయత్నం చేశామని స్పష్టం చేశారు క్వాంజల్ వెల్లడించారు.