ENTERTAINMENT

సేవ్ టైగ‌ర్స్ 2 ట్రైల‌ర్ కిర్రాక్

Share it with your family & friends

డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్

హైద‌రాబాద్ – ఇప్పుడు వెబ్ సీరీస్ ల కాలం న‌డుస్తోంది. తెలుగులో కూడా పెద్ద ఎత్తున వెబ్ సీరీస్ లు వ‌స్తున్నాయి. ఇంకొన్ని పోటీ ప‌డేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇప్ప‌టికే హాట్ స్టార్ లో విడుద‌లైన సేవ్ టైగ‌ర్స్ వెబ్ సీరీస్ -1 దుమ్ము రేపింది. విడుద‌లై వెబ్ సీరీస్ ల‌లో టాప్ గా నిలిచింది. రేటింగ్ లో నెంబ‌ర్ 1గా నిలిచింది. దీంతో నిర్మాత‌లు మ‌రో ప్లాన్ చేశారు. ఈ మేర‌కు సేవ్ టైగ‌ర్స్ సీరీస్ -2 ను రూపొందించింది. మ‌రింత ఆహ్లాద‌క‌రంగా ఉండేలా ప్లాన్ చేశారు ద‌ర్శ‌కుడు.

శ‌నివారం సేవ్ టైగ‌ర్స్ వెబ్ సీరీస్ -2కు సంబంధించి ట్రైల‌ర్ విడుద‌లైంది. రిలీజ్ అయిన వెంట‌నే భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఇందులోని డైలాగులు మ‌రింత ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఎప్ప‌టి లాగే ఆయా పాత్ర‌ల‌లో జీవించారు న‌టీన‌టులు.

గంటా ర‌విగా ప్రియ‌ద‌ర్శి, రాహుల్ గా అభిన‌వ్ గోమ‌తం, విక్ర‌మ్ గా చైత‌న్య కృష్ణ‌, హైమావ‌తి గా జోర్దార్ సుజాత , మాధురిగా పావ‌ని గంగి రెడ్డి న‌టించారు. వీరితో పాటు సీరీస్ లో రేఖ పాత్ర‌లో దేవీయ‌ని శ‌ర్మ‌, పోశ‌వ్వ‌గా గంగ‌వ్వ‌, హంస లేఖ‌గా సీర‌త్ క‌పూర్ , హారిక‌గా ద‌ర్శ‌న బానిక్ , విజ‌య కాంత్ గా వేణు య‌ల్దండి, లక్ష్మిగా రోహిణి, ల‌బోనిగా ఆర్తి గణేష్క‌ర్ న‌టించారు. ఈ సీరీస్ కు ద‌ర్శ‌క‌త్వం అరుణ్ కొత్త‌ప‌ల్లి చేశారు. ర‌చ‌నా స‌హ‌కారం ప్ర‌దీప్ , విజ‌య్ , ఆనంద్ కార్తీక్ అందించారు. సంగీతం అజ‌య్ అర‌సాడ ఇచ్చాడు.

ఈ వెబ్ సీరీస్ స్టార్ లో మార్చి 15న స్ట్రీమింగ్ కానుంది.