కాంగ్రెస్ కు షాక్ సావిత్రి జిందాల్ రిజైన్
దేశంలోనే అత్యంత రిచెస్ట్ విమెన్
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికల వేళ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది కాంగ్రెస్ పార్టీకి. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ రాజీనామా చేశారు. ఆయన ఉన్నట్టుండి బీజేపీలో చేరారు. మోదీ నాయకత్వం దేశానికి అవసరమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గురువారం మరో షాక్ తగిలింది హస్తానికి. భారత దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు సావిత్రి జిందాల్. ఆమె తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని సావిత్రి జిందాల్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. త్వరలోనే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. తన కుటుంబ సభ్యుల సలహా మరకే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే తనయుడు నవీన్ జిందాల్ తాజాగా బీజేపీలోకి జంప్ అయిన వారిలో ఉండడం విశేషం. నిన్న కొడుకు నేడు తల్లి ఇద్దరూ ఇప్పుడు బీజేపీలో చేరడం ఒకింత విస్తు పోయేలా చేసింది.