NEWSNATIONAL

ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు క‌న్నెర్ర‌

Share it with your family & friends

మార్చి 12 లోపు వివ‌రాలు ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం నిప్పులు చెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. మార్చి 12 సాయంత్రం లోపు తాము కోరిన ఎలక్టోర‌ల్ బాండ్ల వివ‌రాలు ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. లేక పోతే ధిక్కారం కింద చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. సుప్రీంకోర్టు దెబ్బ‌కు ఎస్బీఐ ఏం చేస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించక పోతే ఎస్‌బీఐపై ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ దాతలకు సంబంధించిన వివరాలను అందించడానికి జూన్ 30 వరకు సమయాన్ని పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 12 లోగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)తో సమాచారాన్ని పంచుకోవాలని, మార్చి 15వ తేదీసాయంత్రం 5 గంటలలోగా వెబ్ సైట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్రచూడ్ ఆధ్వ‌ర్యంలోని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బి.ఆర్. గవాయ్, జె.బి. పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది. తాము జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించేందుకు ప్ర‌య‌త్న‌మే అవుతుంద‌ని పేర్కొంది.

బ్యాంక్‌కు వ్యతిరేకంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), కామన్ కాజ్ , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌తో పాటు, కోర్టు ముందస్తు గడువును పొడిగించాలన్న ఎస్‌బిఐ దరఖాస్తును బెంచ్ విచారించింది.