NEWSANDHRA PRADESH

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్

Share it with your family & friends

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు

అమ‌రావ‌తి – వైఎస్సార్సీపీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు (ఎంపీ ) అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే వైసీపీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, సోష‌ల్ మీడియా వాలంటీర్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది ఏపీ కూట‌మి స‌ర్కార్. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన‌ట్టుగానే కేసుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. జ‌గ‌న్ రెడ్డి ప‌రివారానికి కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు పోలీసులు.

తాజాగా ఈ జాబితాలోకి చేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జ‌గ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సైతం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండ‌గా హ‌రి అనే యువ‌కుడు త‌న‌ను దూషించారంటూ ఎంపీపై ఫిర్యాదు చేశారు. దీంతో పులివెందుల పీఎస్ లో కేసు న‌మోదైంది.

సింహాద్రిపురానికి చెందిన హరి ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి, జ‌గ‌న్ రెడ్డి భార్య భార‌తీ రెడ్డి సోద‌రుడు వర్రా రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డి, రాఘవపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే స‌మ‌యంలో వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వ‌ర్రా రాఘ‌వ రెడ్డిపై.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసినందుకు గాను వీరిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు.