Monday, April 7, 2025
HomeNEWSప్ర‌యాగ్ రాజ్ కు ప‌లు రైళ్లు ర‌ద్దు

ప్ర‌యాగ్ రాజ్ కు ప‌లు రైళ్లు ర‌ద్దు

సికింద్రాబాద్ డివిజ‌న్ షాక్

హైద‌రాబాద్ – మ‌హా కుంభ మేళాకు వెళ్లే భ‌క్తుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి ప్ర‌యాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నంబ‌ర్ రైలును ర‌ద్దు చేసింది. ఈ రైలు అల‌హాబాద్ కు వెళుతుంది. దీంతో అక్క‌డికి వెళ్లాల‌ని అనుకున్న 1500 మంది భ‌క్తుల‌కు షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం రాత్రి 11.45 నిమిషాల‌కు ముందుగా బుక్ చేసుకున్న వారికి మెస్సేజ్ లు పంపించింది. అంతే కాకుండా ఈనెల 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు రావాల్సిన 12792 నంబ‌రు రైలునూ ఆప‌రేష‌నల్ కార‌ణంతో ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ప్ర‌యాగ్ రాజ్ కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 50 కోట్ల మందికి పైగా భ‌క్తులు పుణ్య స్నానాలు చేశార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సీఎం యోగి ఆదిత్యానాథ్ వివ‌రాలు వెల్ల‌డించారు. కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని, ఇప్ప‌టికే విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ అవుతుండ‌డంతో వాహ‌నాల రాక పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని చెప్పారు. అందుకే 3 కిలోమీట‌ర్ల దూరంలోనే నిలిపి వేయించామ‌న్నారు.

ఏ ఒక్క భ‌క్తుడు కూడా ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. తాము కేవ‌లం ఈసారి మ‌హా కుంభ‌మేళాకు క‌నీసం 40 కోట్ల మంది పుణ్య స్నానం చేస్తార‌ని అనుకున్నామ‌ని, కానీ
ఏకంగా 50 కోట్ల మందికి పైగా వ‌చ్చార‌ని ఇంకా ఆ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments