Friday, April 18, 2025
HomeNEWSANDHRA PRADESHసంక్రాంతికి ఆరు ప్ర‌త్యేక రైళ్లు

సంక్రాంతికి ఆరు ప్ర‌త్యేక రైళ్లు

ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

హైద‌రాబాద్ – ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఇవాల్టి నుంచి గోదావ‌రి జిల్లాల‌కు ఆరు ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టి నుంచే బుకింగ్స్ కూడా స్టార్ట్ చేస్తామ‌ని పేర్కొంది. కాచిగూడ..కాకినాడ టౌన్, హైదరాబాద్-కాకినాడ టౌన్ మధ్య రైళ్లు న‌డిపిస్తామ‌ని తెలిపింది. జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రైళ్ల రాకపోకలు సాగిస్తాయ‌ని పేర్కొంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి సంక్రాంతి పండుగ‌ను పెద్ద ఎత్తున జ‌రుపుకుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో అత్య‌ధికంగా ఇక్క‌డికి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధానంగా కోళ్ల పందాలు ఎక్కువ‌గా జ‌రుగుతాయి.

ర‌వాణా ప‌రంగా ఫ్లైట్స్, బ‌స్సులు, రైళ్లు ప్ర‌యాణీకుల‌తో సంద‌డిగా ఉంటుంది. చాలా మ‌టుకు సీట్లు దొర‌క‌డం క‌ష్టం. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సైతం అత్య‌ధిక బ‌స్సుల పెంపుపై ఫోక‌స్ సారించారు.

అత్య‌ధిక ఆదాయం ఈ సంక్రాంతి పండుగ రోజు రానుంది. ఆంధ్రా సెటిల‌ర్స్ ఎక్కువ‌గా హైద‌రాబాద్ లో ఉన్నారు. వీరంతా సంక్రాంతికి త‌మ ఊళ్ల‌కు వెళుతారు. స్పెష‌ల్ స‌ర్వీస్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేయ‌నుంది ఆర్టీసీ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments