విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
అమరావతి – దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. విజయవాడ డివిజన్ లోని నిడదవోలు- కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి వెల్లడించారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ – రాజమండ్రి (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు- విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ- తిరుపతి (22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
జూన్ 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం- విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్ ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), విశాఖ- లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ కూడా నిలిపి వేసినట్లు తెలిపారు.