NEWSANDHRA PRADESH

ప‌ర్యాట‌క రంగంలో సీ ప్లేన్ అద్భుతం – సీఎం

Share it with your family & friends

ప్రారంభించిన నారా చంద్ర‌బాబు నాయుడు

నంద్యాల జిల్లా – రాష్ట్ర ప‌ర్యాట‌క రంగంలో సీ ప్లేన్ ను ప్రారంభించ‌డం అద్భుత‌మని అన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం ఆయ‌న ప్రారంభించ‌డ‌మే కాదు దానిలో శ్రీ‌శైలం దేవాల‌యం దాకా ప్ర‌యాణం చేశారు.

ఇదిలా ఉండ‌గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి స్లీప్లేన్ లో ప్రయాణించ‌డం సంతోషం క‌లిగించింద‌న్నారు. ఆయ‌న‌తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కూడా ఉన్నారు.

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో… శ్రీశైలం పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఎఫ్ఐసీసీఐ పార్ట్నర్స్ గా ఉన్నారు.

ఈ సీ ప్లేన్ శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ అద్భుత ఆవిష్కరణ వీక్షించిన పాతాళగంగ లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తమ హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి వెల్ క‌మ్ చెప్పారు.

అనంతరం పాతాళగంగ నుంచి రోప్ వే లో శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నారు చంద్ర‌బాబు నాయుడు.