BUSINESS

అనిల్ అంబానీపై సెబీ 5 ఏళ్ల పాటు నిషేధం

Share it with your family & friends

మ‌రో 24 మందిపై కూడా బ్యాన్ విధింపు

ముంబై – సెబీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రిల‌య‌న్స్ సంస్థ‌ల గ్రూప్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ సోద‌రుడు అనిల్ అంబానీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఆయ‌న‌ను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సెబీ అధికారికంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది.

అనిల్ అంబానీతో పాటు మ‌రో 24 మందిపై కూడా వేటు వేసింది. వారిపై కూడా సెక్యూరిటీస్ మార్కెట్ నుండి 5 సంవ‌త్స‌రాల పాటు బ్యాన్ విధిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది సెబీ.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి నిధులను “ఆఫ్” చేయడానికి అంబానీ ఒక పథకాన్ని రూపొందించారని పేర్కొంంది సెబీ. అనిల్ అంబానీపై 250 మిలియన్ రూపాయల (సుమారు $3 మిలియన్లు) జరిమానా విధించింది.

ఈ రుణగ్రహీతలలో ఎక్కువ మంది కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేసే సామర్థ్యంతో పెద్ద షేర్‌హోల్డర్‌లతో ముడిపడి ఉన్నారని సెబీ ఆరోపించింది.