NEWSTELANGANA

సికింద్రాబాద్..గోవాకు కొత్త రైలు

Share it with your family & friends

వెల్ల‌డించిన కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. గోవా వెళ్లాల‌ని అనుకునే వారికి శుభ వార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది.

ఇప్పటి వరకూ వారానికి ఒక రైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొనేది. అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిపి గోవాకు ప్ర‌యాణం చేసేది.

. ఇది కాకుండా కాచీగూడ – యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపే వారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.

ఇలా సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌. దీని గురించి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించారు.

సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రైలును ప్ర‌క‌టించినందుకు కేంద్ర మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బ‌య‌లు దేరుతుంది. కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుంది.