ENTERTAINMENT

మునావ‌ర్ ఫరూఖీకి భ‌ద్ర‌త పెంపు

Share it with your family & friends

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్

ముంబై – ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫ‌రూఖీకి భారీ ఎత్తున భ‌ద్ర‌త పెంచారు. ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు ఏర్ప‌డి ఉంద‌ని స‌మాచారం అంద‌డంతో పోలీసులు మునావ‌ర్ ఫ‌రూకీపై ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు స్టాండ‌ప్ క‌మెడియ‌న్ కు ఏకంగా 40 మంది స‌భ్యుల‌తో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ నుంచి ప్రాణ హాని ఉంద‌ని నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. ఈ మేర‌కు ప్ర‌స్తుతం ఉన్న సెక్యూరిటీకి సంబంధించి అద‌న‌పు భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్లు పేర్కొంది మ‌రాఠా స‌ర్కార్.

ఇదిలా ఉండ‌గా ఇండోర్ షోలో హిందువుల మనో భావాలను దెబ్బ తీసినందుకు లారెన్స్ బిష్ణోయ్ హిట్‌లిస్ట్‌లో మునావర్ ఫరూఖీ ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

కాగా గ్యాంగ్ స్ట‌ర్ ప్ర‌స్తుతం లారెన్స్ బిష్ణోయ్ తనను తాను “హిందూ అండర్ వరల్డ్ డాన్”గా చూపించాలని అనుకుంటున్నాడని టాక్. మ‌రో వైపు లారెన్స్ నుంచి ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ కు ముప్పు ఉంద‌ని ఆయ‌న‌కు కూడా సెక్యూరిటీ పెంచారు.