మన్యం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన
అమరావతి – పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది. ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీస్ ఆఫీసర్ హల్ చల్ చేశాడు. ఫేక్ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాశ్ గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వ్యవహారంపై తెలిసిన వెంటనే ఆరా తీశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై తనకు తెలియ చేయాలని ఆదేశించారు. మరో వైపు సనాతన ధర్మ ప్రచారకర్తగా , పరిరక్షకుడిగా తనను తాను ప్రకటించుకున్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
అప్పటి నుంచి డిప్యూటీ సీఎంకు బెదిరింపులు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవలే డిప్యూటీ సీఎం పేషీకి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తం అయ్యారు పోలీసులు. పవన్ కళ్యాణ్ కు జెడ్ సెక్యూరిటీ భద్రతను ఏర్పాటు చేశారు. తాజాగా జరిగిన ఘటన మరింత ఆందోళనను రేకెత్తించేలా చేసింది. సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.