ప్రకటించిన నిఘా వర్గాలు
ఢిల్లీ – కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ ద్రోహానికి పాల్పడినట్లు 11 మందిపై అభియోగాలు మోపింది. ఈ మేరకు వారి వివరాలను వెల్లడించింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ప్రకటించింది. వీరిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తో పాటు మరో 10 మంది ఉన్నట్లు తెలిపింది. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విస్తు పోయేలా చేసింది. ప్రకటించిన వారిలో జ్యోతి, దేవేంద్ర సింగ్ దిల్హాన్, తారిఖ్, ఆర్మన్, నౌమన్ ఇలాహి, షహజాద్, మహ్మద్ ముర్తజా అలీ, గజాలా, యామిన్ మొహ్మద్, సుఖ్ ప్రీత్ సింగ్, కరన్ బీర్ సింగ్ ఉన్నారని ప్రకటించింది.
1) జ్యోతి మల్హోత్రాది హర్యానా. స్వస్థలం హిసర్. తనకు 33 ఏళ్లు. సామాజిక మాధ్యమాలలో ఆదరణ ఉంది. ట్రావెలింగ్ వీడియోస్ చేస్తోంది. పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. తను పాక్ కు ఇక్కడి సమాచారాన్ని చేర వేసింది.
2) దేవేంద్ర సింగ్ దిల్హన్ ది పంజాబ్. ఖల్స కాలేజీలో ఎంఏ చదువుతున్నాడు. కొన్నేళ్ల కిందట పాక్ గూఢచర్య సంస్థతో సంబంధం ఏర్పడింది. తను ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు.
3) తారిఖ్ ది స్వస్థలం హర్యానా. పాక్ కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. విచారణ చేపట్టారు. తను ఒప్పుకున్నాడు కూడా.
4) అర్మన్ పూర్తిగా భారత్ కు చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తూ వచ్చాడు. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది నిఘా సంస్థలు. చివరకు తనను అదుపులోకి తీసుకుంది.
5) నౌమన్ ఇల్లహిది యూపీ. తను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే పాకిస్తాన్ కోసం పని చేశాడు. ఇక్కడి సమాచారంతో తనకు డబ్బులు ముట్టేవని నిఘా సంస్థలు ప్రకటించాయి.
6) షహజాద్ ది కూడా యూపీలోని మొరాదాబాద్. అక్రమ రవాణా ఇతడి పని. పాకిస్తాన్ నిఘా వర్గాలతో సంబంధం ఏర్పర్చుకున్నాడు. తనను అరెస్ట్ చేశారు.
7) మహ్మద్ ముర్తాజా అలీది వెరీ వెరీ స్పెషల్. తను పాకిస్తాన్ కోసం పని చేశాడు. ఏకంగా ఓ యాప్ ను కూడా తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
8) గజాలా స్వస్థలం పంజాబ్. పాకిస్తాన్ కు డబ్బులు పంపించింది. తనను నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి.
9) యామిన్ మహ్మద్ స్వస్థలం పంజాబ్. తను పూర్తిగా ఇండియాకు వ్యతిరేకంగా పని చేశాడు. పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉన్నాడు.
10) సుఖ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం పంజాబ్ . తను పాకిస్తాన్ కోసం గూఢచారిగా పని చేస్తూ వచ్చాడు. తనను నిఘా వర్గాలు గుర్తించింది. అదుపులోకి తీసుకుంది.
11) కరన్‌బీర్ సింగ్ స్వస్థలం పంజాబ్. తను ఇక్కడి ఆర్మీ విషయాలను పంచుకున్నాడు. తనను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.